మహిళల గోప్యతను రక్షించడానికి సౌదీ మహిళా న్యాయవాదులు నియామకం

- January 25, 2018 , by Maagulf
మహిళల గోప్యతను రక్షించడానికి సౌదీ మహిళా న్యాయవాదులు నియామకం

రియాద్ : పురుషుల నిష్పత్తికి అనుగుణంగా మహిళా న్యాయవాదులను ఇకపై సమాన హోదాతో  భర్తీ చేస్తారని సౌదీ అరేబియా అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్ మోజబ్ తెలిపారు. స్థానిక విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహిళల రక్షణకు,మహిళా గోప్యతను కాపాడేందుకు ఉద్దేశించిన ఉద్యోగాలని ఆయన పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో మహిళల పాత్రకు అవసరమైన విజన్ 2030 అవసరాలకు అనుగుణంగా ఆయా నియామకాలు జరగనునట్లు ఆయన వివరించారు. అవినీతి ఆరోపణలు ఉన్న మహిళలకు సంబంధించిన కేసులను మహిళలచేతనే నిస్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు చేయడానికి కొత్త ఉద్యోగాలు (మహిళా పరిశోధకులు) న్యాయవ్యవస్థ లో  సృష్టించినట్లయితే, సాధారణ ప్రాసిక్యూటర్ మహిళలపై ఎటువంటి ఆరోపణలు లేవని చెప్పారు. ఒకవేళ అలాంటి కేసు గనుక తమ దృష్టికి వస్తే , ఈ వ్యవస్థ ద్వారా ఏ విధమైన వివక్షత లేకుండా విచారణ నిజాయితీగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. అవసరమైతే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉద్యోగాలలోని ఇతర ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఆల్-మోజబ్ చెప్పారు. మహిళల హోదాల్లోని పరిస్థితులపై అల్ మోజబ్ మాట్లాడుతూ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉద్యోగాలలో మహిళ ..పురుష ఉద్యోగులకు సమాన స్థాయిలోనే ఆయా పరిస్థితులు వర్తిస్తాయిన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com