ఫ్రాన్స్‌వ్యాప్తంగా భారీ వర్షాలు
- January 26, 2018
- ఆకస్మిక వరద భయంతో పారిస్‌లో వందలాదిమంది తరలింపు
పారిస్ : ఫ్రాన్స్‌వ్యాప్తంగా నదులు పొంగిపొర్లుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా పారిస్ ప్రాంతం నుండి వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు సంభవించే అవకాశాలు వుండడంతో దేశవ్యాప్తంగా 13 విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. కాగా ఇంకా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే వున్నాయి. పారిస్‌లో సీనె నదికి ఉధృతంగా నీరు రావడంతో శనివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు. తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ శీతాకాలంలో భారీ వర్షాలు కురియడమే ఆకస్మిక వరదలకు కారణమని అధికారులు పేర్కొన్నారు. పారిస్‌లో వర్షాలు సాధారణ స్థాయి కన్నా రెండు రెట్లు ఎక్కువగా కురిశాయి. గురువారం నాటికి సీనె నది నీటిమట్టం 18 అడుగులకు చేరుకుందని, శనివారం నాటికి 20 అడుగులకు చేరుతుందని భావిస్తున్నారు. 1910లో పారిస్‌కు భారీ వరదలు వచ్చినపుడు ఈ నది నీటి మట్టం 28 అడుగులు వుంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







