సౌదీ యాక్సిడెంట్: ఏడుగురు మహిళలు దుర్మరణం
- January 27, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలోని జజాన్ రీజియన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సౌదీ గెజిట్ రిపోర్ట్ ప్రకారం మదయా - షవర్మా రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు, ట్రక్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్ళికి వెళుతుండగా, బాధిత కుటుంబం ఈ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సివిల్ డిఫెన్స్ యూనిట్స్, సంఘటన గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. సౌదీ రెడ్ క్రిసెంట్ వాలంటీరులు సకాలంలో చాకచక్యంగా వ్యవహరించారని సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి జజాన్ లెప్టినెంట్ కల్నల్ యహ్యా ఖహ్తాని చెప్పారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







