3000 మీటర్ల రేస్: బహ్రెయినీ అథ్లెట్ విజయం
- January 27, 2018
మనామా: బహ్రెయినీ స్ప్రింటర్ మొహమ్మద్ అయూబ్ టివౌలి, 3000 మీటర్ల రేసులో తొలి స్థానం దక్కించుకున్నారు. జెక్ రిపబ్లిక్‌లోని ఓస్రస్టావాలో ఈ పోటీలు జరుగుతున్నాయి. బహ్రెయినీ ఛాంపియన్ మొదటి స్థానంలో నిలవగా, కెన్యాకి చెందిన బెంజమిన్ కిజెన్ రెండో స్థానంలో, ఇథియోపియన్ అత్లెట్ తిలాహెన్ హైలీ మూడో స్థానంలో నిలిచారు. టోర్నమెంట్ రికార్డ్‌ని సైతం బహ్రెయినీ అథ్లెట్ బ్రేక్ చేశారు. అలాగే ఐఏఏఎఫ్ వరల్డ్ ఇండోర్ ఛాంపియన్‌షిప్ 2018కి కూడా క్వాలిఫై అయ్యారు. మార్చి 1 నుంచి 4 వరకు యూకేలోని బర్మింగ్‌హామ్‌లో ఈ పోటీలు జరుగుతాయి. బహ్రెయినీ ఛాంపియన్‌కి బహ్రెయిన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అబ్దుల్‌లతీఫ్ బిన్ జలాల్ అభినందనలు తెలిపారు. ముందు ముందు ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







