ఆలీలో అక్రమ స్ట్రీట్‌ వెండర్స్‌కి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌

- January 27, 2018 , by Maagulf
ఆలీలో అక్రమ స్ట్రీట్‌ వెండర్స్‌కి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌

మనామా: నార్తరన్‌ ఏరియా మునిసిపాలిటీ, అక్రమ స్ట్రీట్‌ వెండర్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. ఆలి విలేజ్‌లో తాజాగా ఈ మేరకు క్యాంపెయిన్‌ నిర్వహించింది. నార్తరన్‌ ఏరియా మున్సిపల్‌ కౌన్సిల్‌ అబ్దుల్లా అషూర్‌, లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ, సెక్యూరిటీ అథారిటీస్‌, ఉర్బాసెర్‌ క్లీనింగ్‌ కంపెనీతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. పౌరుల నుంచి అక్రమ స్ట్రీట్‌ వెండర్స్‌ కారణంగా ఏర్పడుతున్న న్యూసెన్స్‌ వచ్చిన ఫిర్యాదుల మేరకు క్యాంపెయిన్‌ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గార్మెంట్స్‌, ఫుడ్‌ స్టఫ్‌, మీట్‌, ఫిష్‌, బ్యాన్‌ చేసిన టొబాకో ఉత్పత్తులు, అక్రమ ట్యాక్సీ సర్వీసులు ఈ ప్రాంతంలో ఎక్కువగా రెసిడెంట్స్‌ని ఇబ్బంది పెడుతున్నాయి. అక్రమ వెండర్స్‌లో ఎక్కువమంది దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com