అంగరంగ వైభవంగా 'రెహ్మాన్' కాన్సెర్ట్
- January 27, 2018
దుబాయ్:జనవరి 26న సంగీత మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్ కాన్సెర్ట్ అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ పార్క్స్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆహూతులు అత్యద్భుతంగా ఎంజాయ్ చేశారు. రెహమాన్ లైవ్ పెర్ఫామెన్స్కి తోడు, అర్మాన్ మాలిక్, నీతి మోహన్, బెన్నీ దయాల్, జోనితా గాంధీ, హరిచరణ్ శేషాద్రి, హర్షదీప్ కౌర్, జావెద్ అలీ ఈ కార్యక్రమానికి విచ్చేసినవారిని అలరించారు, తమ పాటలతో సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు. కనీ వినీ ఎరుగని రీతిలో తీర్చిదిద్దిన స్టేజ్, మిరుమిట్లు గొలిపే దీప కాంతులు, ఒకటేమిటి రెహమాన్ కాన్సెర్ట్ నభూతో నభవిష్యతి అనే రేంజ్లో జరిగింది. 'కాదల్ దేశం'లోని 'ముస్తఫా ముస్తఫా' సాంగ్‌కి ఆడియన్స్ సైతం పదం, పాదం రెండూ కలిపేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఈ ప్రోగ్రామ్ అత్యద్బుతంగా సాగింది. ఎముకలు కొరికే చలిని, మంచునీ ఎవరూ లెక్క చేయలేదు. ఓ పక్క హీటెక్కించే పెర్ఫామెన్స్లు, ఇంకోపక్క చలి రెండూ బ్యాలెన్స్ అయిపోయాయి.



తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







