దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
- January 27, 2018
జోహన్స్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో టీంఇండియా విక్టరీ కొట్టింది. బౌన్సీ పిచ్ పై సఫారీ ఆటగాళ్లను ఎట్టకేలకు మట్టి కరిపించి క్లీన్ స్వీప్ నుండి బయటపడింది. దీంతో టీమిండియా 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. టీమిండియా బౌలర్లలో షమీ 4 వికెట్లు తీయగా, బుమ్రా, ఇషాంత్ శర్మలకి రెండేసి వికెట్లు, భువనేశ్వర్ కుమార్‌కి ఒక వికెట్ దక్కాయి. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులకి ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన భారత్ 247 పరుగులు చేసింది. 241 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిన దక్షిణాఫ్రికా 177 పరుగులకే కుప్పకూలింది. దీంతో 63 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది భారత్, అలాగే 1-2 సిరీస్ ను కోల్పోయింది.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







