అర్జునుణ్ణి వెనక్కి నెట్టేసిన రాముడు

- January 28, 2018 , by Maagulf
అర్జునుణ్ణి వెనక్కి నెట్టేసిన రాముడు

మెగాఫ్యామిలీ హీరోల్లో పరస్పర పోటీ ఎక్కువవుతోంది. ఫిబ్రవరి 9న వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ పోటీ పడుతుంటే.. తమ సినిమాల టీజర్ క్రేజ్ విషయంలో చరణ్, బన్నీ బాహాబాహిగా తలపడుతున్నారు. మరి ఈ పోటీలో గెలుపెవరిదో చూద్దామా..?

రామ్‌చరణ్ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటింది. 'రంగస్థలం' సెట్స్ పైకి వచ్చి కూడా నెలలు కావస్తోంది. మార్చి నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఇన్నాళ్లుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తోన్న చరణ్ అభిమానులకు టీజర్‌తో ఫుల్ ట్రీట్ ఇచ్చాడు సుకుమార్. అందుకేనేమో టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. మైత్రి మూవీస్ అఫీషియల్ ఛానల్‌లో 80 లక్షల వ్యూస్ దాటుకుని కోటి వ్యూస్‌కు చేరువవుతోంది 'రంగస్థలం' టీజర్. మరోవైపు విడుదలైన అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ కలుపుకుని 25.5 గంటల్లోనే కోటి వ్యూస్‌ను ఈ టీజర్ దాటేయడం విశేషం.

రామ్‌చరణ్ తొలిసారి పక్కా పల్లెటూరి పాత్రలో కనిపించనుండటం టీజర్ చివరలో కొడవలి పట్టుకు మాస్ గెటప్‌లో నడిచొస్తోన్న సీన్.. అభిమానులకు తెగ నచ్చేసింది. ఇక సుకుమార్ చరణ్‌ను ఎలా చూపిస్తాడా అనే ఉత్సుకత కూడా టీజర్‌కు ఇలా రికార్డ్ వ్యూస్ రావడానికి కారణమైంది. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఇలా హయ్యస్ట్ వ్యూస్‌ను అందుకున్న టీజర్స్ లో 'రంగస్థలం' టీజర్ రెండో స్థానంలో ఉంది. 24 గంటల్లోనే కోటి వ్యూస్‌తో 'బాహుబలి' తొలిస్థానంలో ఉండగా 29 గంటల్లో కోటి వ్యూస్ అందుకుని బన్నీ 'నా పేరు సూర్య' రెండో స్థానంలో ఉంది. అయితే 'రంగస్థలం' టీజర్ తాజా రికార్డ్‌తో బన్నీ మూవీ మూడో ప్లేస్ లోకి వెళ్ళింది. నెల రోజుల గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చరణ్, బన్నీలో ఎవరు టాప్ హిట్ అందుకుంటారో చూడాలి..!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com