అమెరికాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
- January 28, 2018
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. గత శుక్రవారం డల్లాస్‌లో వెంకన్నగారి కృష్ణచైతన్య తన గదిలో ప్రాణాలు విడిచాడు. డల్లాస్‌లోని ఓ ఇంట్లో కృష్ణచైతన్య పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తన గది నుంచి బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు గది తలుపు తీసి చూడగా.. మంచం మీద కృష్ణ చైతన్య చనిపోయి కనిపించాడు. కృష్ణ చైతన్యది సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్ స్వస్థలం. కాగ్నిజెంట్ కంపెనీ ఉద్యోగంలో భాగంగా మూడున్నరేళ్ల క్రితం ఆయన అమెరికాకు వెళ్లారు. మూడు నెలల కిందటే డల్లాస్‌లోని సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కంపెనీకి ఉద్యోగం మారటంతో అక్కడే ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు.
తెలంగాణ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు గోలి మోహన్, శ్రీధర్ మాధవనేని ఆధ్వర్యంలో కృష్ణచైతన్య మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున సంప్రదింపులు జరిపి సకాలంలో భౌతికకాయాన్ని తరలించేలా మంత్రి హరీశ్‌రావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పోస్టుమార్టం, తదితరాలు పూర్తయిన అనంతరం గురువారంలోగా మృతదేహం హైదరాబాద్ కు చేరుకోనుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!
- యూఏఈలో భారీగా క్రిస్టల్ మెత్ పట్టివేత..!!
- రిజిస్ట్రేషన్ లేని పెప్టైడ్ల విక్రయంపై సౌదీ కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ఐదుగురు ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్







