అన్ని రౌండ్లలోనూ దయాకర్ ఆధిక్యం ..
- November 24, 2015
వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ ప్రత్యర్థులకు అందనంత భారీ అధిక్యంలో దూసుకుపోతున్నారు. 13 వ రౌండ్ పూర్తయ్యే సరికి దయాకర్ 3,31,089 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 13వ రౌండ్ పూర్తయ్యే సరికి తెరాస అభ్యర్థికి 4,43, 915, కాంగ్రెస్ అభ్యర్థికి 1,12,8229, భాజపాకు 89,828 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తొలి నుంచి అన్ని రౌండ్లలోనూ దయాకర్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నానికల్లా తుది ఫలితం వెలువడే అవకాశముంది. వరంగల్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కరుణ, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







