రేపు తెలంగాణ వ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం
- January 29, 2018
హైదరాబాద్ : మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం ( జనవరి-30) తెలంగాణ వ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మౌనం పాటించాలని స్పష్టం చేసింది. ఆ సమయంలో రహదార్లపై వాహన రాకపోకలు కూడా నిలిపివేయాలని అధికారులకు సూచించింది. సరిగ్గా ఉదయం 11 గంటలకు మౌనం పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్ని అధికారులను ఆదేశించింది. ప్రజలు కూడా సహకరించాలని కోరింది ప్రభుత్వం. స్వాతంత్య్రం కోసం బలిదానం చేసిన వారి త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







