శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు మార్చి 18 నుంచి

- January 29, 2018 , by Maagulf
శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు మార్చి 18 నుంచి

భద్రాచలం : శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. వైదికకమిటీ తేదీలను ఖరారుచేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. మార్చి 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, 26న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 27న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. శ్రీ విలంభినామ సంవత్సర వసంత పక్ష తిరుకల్యాణ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఉగాది రోజైన మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ తేదీలను ఖరారుచేసింది. మార్చి 22న పంచమి రోజున ఈ ఉత్సవాలకు అంకురారోపణ గావించనున్నారు. అదేరోజు గరుడాదివాసం వేడుక జరుపుతా రు. మార్చి 24న గజారోహణం, 25న ఎదుర్కోలు ఉత్సవం జరుపుతారు. 26న శ్రీరామనవమి వేడుక (శ్రీసీతారాముల కల్యాణం),27న శ్రీరామ పట్టాభిషేకం, అదేరోజు రాత్రి స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. 28న సదశ్యం, 29న స్వామివారి తెప్పోత్సవం, తాతగుడి సెంటర్‌లో దొంగలదోపు ఉత్సవం, 30న ఊంజల్‌సేవ, 31న వసంతోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్1న చక్రస్నానం, మహాపూర్ణాహుతి, ద్వాదశహారతులు, కంకణ ఉద్వాసన, గరుడపట ఉద్వాసన తదితర వాటిని నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com