కార్పొరేషన్‌లో విలీనానికి గొల్లపూడి పంచాయతీ గ్రీన్సిగ్నల్

- January 29, 2018 , by Maagulf
కార్పొరేషన్‌లో విలీనానికి గొల్లపూడి పంచాయతీ గ్రీన్సిగ్నల్

విజయవాడ: గొల్లపూడి గ్రామ పంచాయతీని విజయవాడ నగరపాలకసంస్థలో విలీనంచేసేందుకు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సర్పంచ్‌ సాధనాల వెంకటేశ్వరమ్మ తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో సభ్యులు పలు సూచనలతో కూడిన 'విలీన' తీర్మానాన్ని ఆమోదించారని చెప్పారు. గ్రామ పరిధిలోని ఖాళీ స్థలాలకు విలీనం తేదీ నుంచి పది సంవత్సరాల పాటు పన్ను మినహయించా లని, పంచాయతీ సిబ్బందిని, కాంట్రాక్టు కార్మికులను నగరపాలకసంస్థలో రెగ్యులర్‌ చేసి కొనసాగించాలని, సూచించినట్టు తెలిపారు.

పైడూరుపాడు పాలకవర్గ సమావేశం కూడా తమ గ్రామాన్ని విజయవాడ నగరంలో విలీనం చేసేందుకు తీర్మానించిందని ఆ పంచాయతీ కార్యదర్శి ప్రసాదరావు తెలిపారు.

రాయనపాడు నో..

విజయవాడ నగరంలో విలీనాన్ని రాయనపాడు పంచాయతీ తిరస్కరించింది. సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశంలో 'విలీన' తీర్మానం వీగిపోయింది. తీర్మానంపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ఓటింగ్‌ నిర్వహించారు. 12 మంది సభ్యుల్లో ఆరుగురు అనుకూలంగా, ఆరుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో సర్పంచ్‌ తలారి అరుణ కుమారి ఓటు ప్రత్యేకమైంది. ఆమె కూడా వ్యతిరేకంగా ఓటు వేయడంతో విలీనానికి నో చెప్పినట్టయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com