ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ముహూర్తం ఫిక్స్

- January 31, 2018 , by Maagulf
ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ముహూర్తం ఫిక్స్

ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ తేజ. ఇందులో 60కి పైగా గెటప్స్ బాలకృష్ణ వేయబోతున్నాడనేది ఫ్యాన్స్‌కు స్పెషల్ న్యూస్. మార్చి నాలుగున మొదలుకానుంది ఈ ఫిల్మ్. కాస్టింగ్ టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సివుంది.

తొలుత జనవరి 18న అంటే ఎన్టీఆర్ వర్ధంతికి టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేసినా, అది ఆశించినట్టుగా రాకపోవడంతో రిలీజ్ చేయలేదని, ఈ మేటర్‌ గురించి తేజతో బాలయ్య కాసింత సీరియస్ గానే మాట్లాడినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ - సాయి కొర్రపాటి - విష్ణు నిర్మించే 'ఎన్టీఆర్' బయోపిక్‌కు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com