మహేష్ కొత్త చిత్రం ఏప్రిల్ లో...

- February 01, 2018 , by Maagulf
మహేష్ కొత్త చిత్రం ఏప్రిల్ లో...

గత రెండేళ్లు గా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్లాపులు వెంటాడుతున్నాయి..నాల్గు చిత్రాల్లో నటిస్తే ఒక్క సినిమా హిట్ కాగా , మిగతా మూడు డిజాస్టర్లు గా మిగిలాయి. ప్రస్తుతం మహేష్ చేస్తున్న భరత్ అనే నేను ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ కు చాల ముఖ్యం. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ మూవీ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇక ఈ సినిమా పూర్తి కాగానే వెంటనే వంశీ పైడిపల్లి తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఏప్రిల్‌లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందట. ప్రముఖ నిర్మాతలు అశ్వనిదత్‌, దిల్‌ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com