ఇకపై రెస్టారెంట్ల లో పని చేసేందుకు సౌదీ మహిళలు
- February 01, 2018
రియాద్ : ఆహార రంగంను కుటుంబీకరణ స్థానంలో చేర్చాలని సౌదీ చాంబర్స్ కౌన్సిల్ యోచన చేసిందని బుధవారం అల్-మదీనా అరబిక్ వార్తాపత్రిక నివేదించింది, ప్రాజెక్ట్ రియాద్ ఎమిర్ యొక్క భార్య ప్రిన్సెస్ నౌరాహ్ బింట్ మొహమ్మద్ నేతృత్వంలో నిర్వహించబడనుంది. "ఒక ప్రయాగాత్మ చర్య ఆధారంగా 16 రెస్టారెంట్లలో మహిళలను నియమించనుందని హుడా అల్-జిరాసీ తెలిపారు. "ఈ రంగంలో ఎక్కువమంది స్త్రీలను నియమించటానికి అవకాశాలను చర్చించడానికి రెస్టారెంట్ యజమానులతో మేము ఒక వర్క్ షాప్ ని నిర్వహిస్తాం" అని అల్-జిరాసీ చెప్పారు.ఇది స్త్రీలను నియమించుటకు మరియు మహిళాసాధికారిత శక్తిని ఇచ్చే ఏడు ఇతర కార్యక్రమాలలో ఒకటిగా పేర్కొనవచ్చు.మహిళల నిరుద్యోగం యొక్క ప్రస్తుత రేటు 33 శాతం. సౌదీ అరేబియా నిరుద్యోగం రేటు మొత్తం 12 శాతంగా ఉంది. ప్రస్తుతం కార్మిక మార్కెట్లో మహిళల వాటా 20 శాతంగా ఉంది. 2030 నాటికి మహిళల పాత్ర రేటు 30 శాతానికి పెరుగుతుంది. జీసీసీ ఆహార సేవారంగం నివేదిక ప్రకారం. సౌదీ అరేబియా, 2015 నాటికి 5.1 బిలియన్ల డాలర్ల మార్కెట్ పరిమాణంతో, ఈ ప్రాంతంలో అతి పెద్ద సర్వీస్ రెస్టారెంట్ జీసీసీ మార్కెట్లో 43.8% వాటాగా ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







