మే 18న గోపీచంద్ 'పంతం' విడుదల
- February 04, 2018
`ఆంధ్రుడు`, `యజ్ఞం`, `లక్ష్యం`, `శౌర్యం`, `లౌక్యం` వంటి సూపర్‌డూపర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ తాజాగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నాడు.. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావడం విశేషం. దీనికి `పంతం అనే టైటిల్‌ను నిర్ణయించారు. `ఫర్ ఎ కాస్` ఉపశీర్షిక. `బలుపు`, `పవర్`, `జై లవకుశ` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సినిమాను మే 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - "మా సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో గోపీచంద్‌గారి 25వ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు `పంతం` అనే టైటిల్‌ను నిర్ణయించాం. సినిమా అనుకున్న ప్రణాళిక ప్రకారం చిత్రీకరణను జరుపుకుంటుంది. అందులో భాగం ఇప్పటికే ఒక పాట, కొంత టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలను అల్యూనిమియం ఫ్యాక్టరీలో చిత్రీకరించాం. మంచి మెసేజ్‌తో పాటు కమర్షియల్ హంగులతో సినిమాను దర్శకుడు చక్రి చక్కగా తెరకెక్కిస్తున్నారు. హీరో గోపీచంద్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన ఎందుకోసం పంతం పట్టాడు. ఆ కారణమేంటనేది తెలుసుకోవాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు.
గోపీచంద్, మెహరీన్, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్ః రమేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చక్రవర్తి, బాబీ(కె.ఎస్.రవీంద్ర), కో డైరెక్టర్ః బెల్లంకొండ సత్యంబాబు, మ్యూజిక్ః గోపీసుందర్, సినిమాటోగ్రఫీః ప్రసాద్ మూరెళ్ల, నిర్మాతః కె.కె.రాధామోహన్, స్టోరీ, డైరెక్షన్ః కె.చక్రవర్తి(చక్రి).
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







