20 ఏళ్ళ కనిష్టానికి యూఏఈ గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్
- February 05, 2018
యూఏఈలో గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్ వరుసగా నాలుగో ఏడాది కూడా పడిపోయింది. వరల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం ఇరవయ్యేళ్ళ కనిష్టానికి ఆ డిమాండ్ పడిపోయినట్లు తెలుస్తోంది. డిసెంబర్లో కొంత మేర యూఏఈలో గోల్డ్ జ్యుయెలరీకి డిమాండ్ పెరిగిందని, వ్యాట్ అమలు తర్వాత అది దారుణంగా పడిపోయిందని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా 2017 చివర్లో గోల్డ్‌కి కొంత మేర డిమాండ్ పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో 4 శాతం వరకు డిమాండ్ పెరిగింది. 2013 తర్వాత ఈ గ్రోత్ కనిపించడం ఇదే తొలిసారి. ఇండియా, చైనా జ్యుయెలరీ విభాగంలో 4 శాతం రికవరీని నమోదు చేసినా, చారిత్రక సరాసరి నుంచి తగ్గుదలే నమోదు చేసినట్లు వరల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ట్యాక్స్ రెగ్యులేషన్ కారణంగా ఇండియాలో డిమాండ్ ఫ్లక్చుయేట్ అవుతూ వస్తోంది.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







