స్వదేశంలో దోచుకొన్నది విదేశంలో దాచారు....
- February 06, 2018
దుబాయ్ : కొల్లగొట్టిన ప్రజాధనంను స్విస్ బ్యాంకులలో దాచుకోవడం పాత విధానం కాగా అక్రమంగా సంపాదించింది దుబాయ్ లో కొందరు విలాసమైన ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసి దాచుకోవడం పరిపాటైంది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖులు కొందరు దుబాయ్‌లో పలుచోట్ల అత్యంత ఖరీదైన విల్లా(ఇళ్లు)లు కొన్నారని జియో న్యూస్ అనే మీడియా సంస్థ సోమవారం ఒక సంచలన వార్త ప్రచురించింది. వీరు ఏ ఒక్కరికి అనుమానం రాకుండా 118 దేశాలకు చెందిన 34 వేల సంపన్న కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో వారు ఖరీదైన భవంతులు కొనుగోలు చేశారని ఆ వార్త పేర్కొంటుంది. మొత్తం 34 వేల ధనిక కుటుంబాలు నివసించే ఆ విల్లాల్లో కేవలం పాకిస్తాన్ కుటుంబాలే 7వేలు ఉన్నాయంటోంది. వీరిలో ముఖ్యంగా రాజకీయనాయకులు, మాజీ న్యాయమూర్తులు, వ్యాపారులు, ఉన్నతాధికారులు , లాయర్లు, గాయకులు, నటులు ఇలా పేరొందిన చాలా మంది పాకిస్తానీయులు 11లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి దుబాయ్‌లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







