డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు తగ్గింపు: మార్చ్ 1 నుంచి అమల్లోకి
- February 06, 2018
మస్కట్: డ్రైవింగ్ లైసెన్స్ పీజుని మార్చి 1 నుంచి తగ్గిస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ఇంతకు ముందు ఈ ఫీజు 20 ఒమన్ రియాల్స్ ఉండగా, ఇప్పుడది 10 ఒమన్ రియాల్స్‌కి తగ్గనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ అధికారి ఒకరు మాట్లాడుతూ, లెర్నింగ్ లైసెన్స్ ఫీజుని ఒమనీయులు, అలాగే వలసదారులకి ఇకపై 10 ఒమన్ రియాల్స్ మాత్రమే ఉంటుందని చెప్పారు. వలసదారులు మాత్రం రెండేళ్ళకోసారి ఈ లైసెన్స్‌ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రెండేళ్ళ కోసం అదనంగా 10 ఒమన్ రియాల్స్ చెల్లించాలి. 20 ఒమన్ రియాల్స్‌తో, ఒమనీయులు పదేళ్ళకోసారి లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. మార్చి 1 నుంచి రాయల్ ఒమన్ పోలీసులు కొత్త రూల్స్‌ని అమల్లోకి తెస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. టెంపరరీ లైసెన్స్ ఉన్న వ్యక్తి పది బ్లాక్ పాయింట్స్ పొందితే, మరిన్ని డ్రైవింగ్ లెసన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదిలో ఏడు బ్లాక్ పాయింట్స్ నమోదైతే టెంపరరీ డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు మాత్రమే పొడిగిస్తారు. ఒమనీ డ్రైవర్స్ ఆరు లేదా అంతకన్నా తక్కువ బ్లాక్ పాయింట్స్ పొందితే పదేళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ దక్కుతుంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







