బ్రెజిల్ ప్రపంచ రహదారి భద్రతా సమావేశంలో పాల్గొన్న బహ్రైన్

- November 25, 2015 , by Maagulf
బ్రెజిల్ ప్రపంచ రహదారి భద్రతా సమావేశంలో పాల్గొన్న బహ్రైన్

 

బ్రెజిల్లో జరుగుతున్నా రెండు రోజుల రెండవ 'గ్లోబల్ హై లెవెల్ కాన్ఫరెన్స్' లో, బహ్రైన్ దేశం తరపున ట్రాఫిక్    డైరక్టర్ జనరల్ - షేక్ నస్సేర్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్- ఖలీఫా అధ్యక్షతన ప్రతినిధి బృందం పాల్గొన్నారు. ఈ రెండు రోజుల సదస్సులో, అవాంచనీయ ట్రాఫిక్ దుర్ఘటనల నివారణా చర్యలు,  ట్రాఫిక్ భద్రతను గురించిన అత్యుత్తమ చర్యలు మొదలైన వానిని తెలియజేసే వర్క్ షాపులు నిర్వహించారు. 2009 మాస్కో ట్రాఫిక్ భద్రతా ప్రకటనకు కొనసాగింపుగా, బ్రెజిల్ భద్రతా ప్రకటనను వెలువరించారు. బ్రెజిల్ దేశ ఫెడరల్ పోలిస్ జనరల్ డైరక్టర్ ను ప్రతినిధి బృందం కలసి, భారీ కార్యక్రమాలలో ట్రాఫిక్ నియంత్రణను మరియు ఇరుదెసల సహాయ సహకారాలను గురించి చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com