నెం.1 లైసెన్స్ ప్లేట్ కొనుగోలుదారుకి మూడేళ్ళ జైలు
- February 06, 2018
అబుదాబీకి చెందిన బిజినెస్ మేన్‌కి మూడేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. అబుదాబీ నెం.1 లిమిటెడ్ లైసెన్స్ ప్లేట్‌ని ఈ వ్యాపారవేత్త 31 మిలియన్ దిర్హామ్‌లకు కైవసం చేసుకున్నాడు. అయితే ఆ మొత్తం చెల్లించే క్రమంలో బ్యాడ్ చెక్‌ని అందించినట్లు బిజినెస్‌మేన్‌పై అభియోగాలు మోపబడ్డాయి. నెంబర్ ప్లేట్‌ని కొనుగోలు చేసి, పనికిరాని చెక్ ఇచ్చారంటూ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టి, కేసుని ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు. బౌన్స్ చెక్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఆ నెంబర్ ప్లేట్‌ని ఇంకొకరికి అమ్మేందుకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని, తద్వారా వచ్చే సొమ్ములోంచి కొంత లాభం తీసుకోవాలనుకున్నాడు నిందితుడు. అయితే ఎవరైనా సరే పూర్తి మొత్తం చెల్లించి, నెంబర్ ప్లేట్ సొంతం చేసుకున్నాకే దాన్ని రీసేల్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. అతని చర్యలు పూర్తిగా చట్ట వ్యతిరేకమని నిర్ధారించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







