కతార్లో వరదలు - స్తంభించిన జనజీవనం
- November 25, 2015
కతార్ లో బుధవారం కురిసిన భారీ వర్షాలు అక్కడి మార్గాలను దిగ్బంధం చేసి, అక్కడి విద్యాలయాలు, అమెరికా రాయబార కార్యాలయం మూసివేతకు గురిచేశాయి. దోహా విమానాశ్రయ పరిసరాల్లో అతి భారీగా - అంటే 66 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలవల్ల ఇంచుమించు అన్ని మార్గాలు అగమ్యంగా తయారవగా, గత సంవత్సరమే ప్రారంభించబడిన దోహాలోని అంతర్జాతీయ విమానాశ్రయ భవనం కారుతూ ఉండడం వలన వర్షప్రభావానికి గురయిందని సోషల్ మీడియా లో వార్తలు వ్యాప్తిస్తుండగా, సంబంధిత అధికారులు అదేమీ లేదని, విమానాలు సరిగానే నడుస్తున్నాయని ప్రకటించారు. కాగా వర్షాలు, కఠిన వాతావరణం వలన తమ కార్యాలయాన్ని వచ్చే వారం వరకు మూసివేస్తున్నామని అమెరికా రాయబార కార్యాలయం వారు ప్రకటించారు. ఇక, దేశ అంతరంగిక శాఖ వారు ఈ వర్ష పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని వాహన చోదకులను విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







