అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి
- February 12, 2018
షార్జా:షార్జాలో సోమవారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఐదుగుర్ని బలిగొంది. మృతిచెందినవారిలో ఇద్దరు చిన్నారులున్నారు. మొరాకోకి చెందిన మహిళ, ఆమె ఇద్దరు చిన్నారులు, ఓ భారతీయ పురుషుడు, ఓ పాకిస్తానీ మహిళ మృతి చెందినవారిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంటల్ని అదుపు చేసే క్రమంలో సివిల్ డిఫెన్స్, పోలీస్ విభాగాలకు చెందిన తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ ఫ్లాట్లోని ఎయిర్ కండిషనర్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బ్యాచిలర్స్ వుంటోన్న ఫ్లాట్లోంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి క్రిమినల్ మోటివ్ లేదని పోలీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ రషీద్ బయాత్ చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడ్తున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







