దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి రస్ అల్ ఖైమాకి స్పెషల్ బస్ సర్వీస్
- February 12, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా టూరిజం డిపార్ట్‌మెంట్ అథారిటీ, కొత్త షటిల్ సర్వీస్‌ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి రస్ అల్ ఖైమాకి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. టెర్మినల్ 1 అలాగే టెర్మినల్ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వీస్, రెండు ఎమిరేట్స్ మధ్య కనెక్టివిటీని పెంచుతుందని అధికారులు తెలిపారు. 2018 చివరి నాటికి మిలియన్ విజిటర్స్‌ని ఆకర్షించే క్రమంలో రస్ అల్ ఖైమా ఈ నిర్ణయం తీసుకుంది.64 కిలోమీటర్ల మేర పొడవైన బీచ్, అరేబియన్ కల్చర్, అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌ని జబెల్ జైస్‌లోనూ సందర్శకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. షటిల్ సర్వీస్‌ని ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. రస్ అల్ ఖైమాలోని అన్ని ప్రముఖ హోటల్స్‌లోనూ పర్యాటకుల్ని డ్రాప్ చేసేలా ఈ షటిల్ సర్వీసుల్ని నిర్వహిస్తున్నారు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా 20 దిర్హామ్‌లకే ఈ సర్వీసుని అందిస్తున్నారు. వైఫై, వాటర్ బాటిల్స్, మ్యాప్స్ ఆన్ బోర్డ్ అందుబాటులో ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 45 నిమిషాలపాటు సాగే ప్రయాణాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేయవచ్చుననీ, ప్రకృతి అందాల్ని బస్‌లోంచి తిలకించవచ్చునని ఆర్‌ఎకె టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ సిఇఓ హైతమ్ మట్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







