ఫేక్ గన్‌తో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్
- February 12, 2018
సౌదీ అరేబియా: సౌదీ పోలీస్, నైజీరియాకి చెందిన వ్యక్తిని దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. రియాద్‌లోని సౌదీ కుటుంబాన్ని ఫేక్ గన్‌తో బెదిరించి పట్ట పగలే నిందితుడు దోపిడీకి పాల్పడ్డాడు. రియాద్‌లో ఇలాంటి దొంగతనం ఇంతకుముందెన్నడూ జరగలేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. దోపిడీ ఘటనకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన టేటాను పోలీసులు విశ్లేషించారు. అనంతరం 38 ఏళ్ళ నిందితుడ్ని ట్రాప్ చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దొంగతనం చేసే క్రమంలో సెక్యూరిటీ కెమెరాని కూడా నిందితుడు ధ్వంసం చేశాడు. గేట్ దూకిన నిందితుడు సర్వైలెన్స్ కెమెరాని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాడు. విల్లాలోని మహిళను ఫేక్ గన్‌తో బెదిరించగా, ఆమె కుమారుడు సకాలంలో అక్కడికి చేరుకుని, దొంగని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా, దొంగ పారిపోయాడు. అనంతరం అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆయుధాలతో దొంగతనాలకు పాల్పడేవారిపై సౌదీలో కఠిన చర్యలుంటాయి. మరణ శిక్షలు సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది నిందితులకి.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







