నితిన్ మూవీ ఛల్ మోహన్‌రంగ..
- February 12, 2018నితిన్, మేఘా ఆకాష్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'ఛల్ మోహన్‌రంగ' అనే టైటిల్‌ను నిర్ణయించారు. శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై నిఖితా రెడ్డి సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ కథ అందించిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆదివారం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. దీనిపై హీరో నితిన్ స్పందిస్తూ, 'పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్ర ప్రచార చిత్రాలను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది' అని ట్వీట్‌తో పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు హైదరాబాద్, ఊటీ, అమెరికాలో షూటింగ్ చేశాం. మిగిలిన ఒక్క పాటను ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. అలాగే చిత్ర టీజర్‌ను ప్రేమికుల రోజైన ఈ నెల 14న, సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. 'షూటింగ్‌తోపాటు సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రం. చాలా సరదాగా సాగుతుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది' అని దర్శకుడు తెలిపారు. డా.కె.వి.నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావు రమేష్, సంజరు స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రా శ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీనాయర్, ఆశురెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోరు, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్.
తాజా వార్తలు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల