బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- September 17, 2025
యూఏఈ: ఫ్రెంచ్ రిటైల్ దిగ్గజం క్యారీఫోర్ తాజాగా కువైట్‌లో తన సేవలకు ముగింపు పలికింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 16 నుంచి కువైట్ లో కార్యాకలాపాలను ముగిస్తున్నామని, ఇన్నాళ్లు సహకరించిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
క్యారీఫోర్ కు 40 దేశాల్లో 14 వేలకుపైగా స్టోర్స్ ఉన్నాయి. గల్ఫ్ దేశాలలో కూడా పెద్ద సంఖ్యలో స్టోర్స్ ను నిర్వహిస్తుంది. ఫ్రాంచైజ్ హక్కులను పొందిన మాజిద్ అల్ ఫుట్టైమ్ ద్వారా 1995లో మధ్యప్రాచ్యానికి వచ్చింది క్యారీఫోర్.
కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్ లోనూ కార్యాకలాపాలను ముగించిన క్యారీఫోర్, జోర్డాన్‌లో తన స్టోర్‌లను నవంబర్ 2024 నుండి మూసివేసింది. కాగా, ఇప్పుడు యూఏఈలో కూడా తన స్టోర్లను మూసివేసే అవకాశం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, యూఏలో ప్రాచుర్యం పొందిన సూపర్ మార్కెట్లలో ఒకటైన క్యారీఫోర్.. దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!







