భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రూహాని
- February 14, 2018
న్యూఢిల్లీ: ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రూహాని మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుంచి 17 వరకు ఆయన పర్యటించనున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. రూహానీ తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలుసుకోనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏ మేరకు బలపడ్డాయన్నదానిపై ప్రత్యేకంగా సమీక్షించనున్నట్టు అధికారులు తెలిపారు.. పరస్పర ప్రయోజనం చేకూరే విధంగా ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టిపెట్టనున్నారు. కాగా ప్రధాని మోదీ 2016 మేలో ఇరాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీలో జరిగే అధికారిక కార్యక్రమాలతో పాటు... ఇరాన్ అధ్యక్షుడు హైదరాబాద్‌ను కూడా సందర్శించనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







