2017లో ఒమన్‌లో 1000 మంది బెగ్గర్స్‌ అరెస్ట్‌

- February 14, 2018 , by Maagulf
2017లో ఒమన్‌లో 1000 మంది బెగ్గర్స్‌ అరెస్ట్‌

మస్కట్‌: వెయ్యి మందికి పైగా బెగ్గింగ్‌ చేస్తున్న వ్యక్తుల్ని గత ఏడాది అరెస్ట్‌ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అరెస్ట్‌ చేసినవారిలో చిన్న పిల్లలు కూడా వున్నారు. సుల్తానేట్‌లోని పలు ప్రాంతాల్లో మొత్తం 1,152 మంది బెగ్గర్స్‌ని అరెస్ట్‌ చేశారు. వీరిలో 18 ఏళ్ళ లోపు వయసున్న పిల్లలు 175 మంది ఉన్నారు. 2017లో మొత్తం 2,000 యాంటీ బెగ్గింగ్‌ క్యాంపెయిన్స్‌ని నిర్వహించారు. ఈ క్యాంపెయిన్స్‌లో 225 మంది ఒమనీయులు, 927 మంది ఇతర దేశాలకు చెందినవారు బెగ్గింగ్‌ చేస్తున్నట్లు నిర్ధారించారు. వారందర్నీ అరెస్ట్‌ చేశారు. ఒమన్‌ చట్టాల ప్రకారం అరెస్టయినవారికి ఏడాదికి తక్కువ కాకుండా జైలు శిక్ష, 100 ఒమన్‌ రియాల్స్‌కి మించకుండా జరీమానా విధించే అవకాశముంది. 225 మంది ఒమనీ బెగ్గర్స్‌లో 152 పురుషులు, 73 మంది మహిళలు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com