అమెరికాలో మారణహోమం, 17 మంది స్టూడెంట్స్ మృతి

- February 14, 2018 , by Maagulf
అమెరికాలో మారణహోమం, 17 మంది స్టూడెంట్స్ మృతి

అమెరికా బెంబేలెత్తుతోంది. ష్యాషన్‌గా మారిన గన్‌కల్చర్ అమాయకులైన స్టూడెంట్స్‌ ప్రాణాలను చిదిమేస్తోంది. తాజాగా ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని మర్జోరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ హైస్కూల్‌లో ఓ దుండగుడు మారణహోమం సృష్టించాడు. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది స్టూడెంట్స్ అక్కడికక్కడే మృతి చెందారు.మరో 14 మంది గాయపడగా, వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. నిందితుడిని అదే స్కూల్‌కు చెందిన 19 ఏళ్ల ఓల్డ్ స్టూడెంట్ నికోలస్‌ క్రూజ్‌. పాఠశాలలోకి ప్రవేశించిన వెంటనే కాల్పులకు తెగబడిన నిందితుడు, అడ్డుకున్న ముగ్గురిని అక్కడికక్కడే కాల్చేశాడు.అనంతరం పాఠశాలలోని ఫైర్ అలారం మోగించాడు. దీంతో ఏదో జరిగిపోతుందన్న హడావుడిలో అందరూ ప్రవేశ ద్వారం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడే కాచుకున్న క్రజ్, వచ్చిన వారిని తుపాకీ ఎక్కుపెట్టాడు.

వెంటనే కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకోవడంతో దుండగుడు స్కూల్ బిల్డింగ్‌లో దాక్కున్నాడు. అనంతరం పోలీసులపైనా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.ఈ స్కూల్‌లో చదువుతున్న నికోలస్‌ క్రజ్‌ వ్యవహారశైలిపై కొద్దిరోజుల కిందట పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుని, అతడ్ని సస్పెండ్ చేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన క్రజ్, స్కూల్‌లోకి చొచ్చుకొచ్చి విచాక్షణారహితం గా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తంచేశారు. మృతిచెందిన స్టూడెంట్స్ ఫ్యామిలీ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com