యూఏఈ వీకెండ్ వెదర్: బలమైన గాలులు, ధూళి, వర్షం కురిసే అవకాశం
- February 15, 2018
అబుదాబీ, అల్ అయిన్ సహా యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఫాగ్, మిస్ట్ కవర్ చేసి ఉన్నాయి. దాంతో రోడ్లపై విజిబిలిటీ గణనీయంగా పడిపోయింది. ఎన్‌సిఎంఎస్, వాతావరణ పరిస్థితుల్ని తెలియజేస్తూ, గురువారం విజిబిలిటీ 1000 మీటర్ల కంటే తక్కువగా ఉందని పేర్కొంది. బలమైన గాలులు, అలాగే డస్ట్ స్టార్మ్స్, తేలికపాటి వర్షం యూఏఈలోని పలు ప్రాంతాల్లో కురుస్తాయని వెల్లడించింది ఎన్‌సిఎంఎస్. శనివారం వరకూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులుంటాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండొచ్చనీ, అయితే ఆకస్మికంగా మేఘాలు ఏర్పడి, ఎక్కడికక్కడ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఎన్‌సిఎంఎస్ హెచ్చరిస్తోంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనీ, దుమ్ము - ధూళితో కూడిన బలమైన గాలులతో ప్రమాదాలు సంభవించవచ్చునని తెలిపింది ఎన్‌సిఎంఎస్. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సీలలో సముద్ర మోడరేట్‌గా ఉండొచ్చు. 4 నుంచి 6 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశముంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి