నగర వీధులలో చెత్త పారేస్తే భారీ జరిమానా..వెల్లడించిన మున్సిపల్ అధికారులు
- February 15, 2018
యూఏఈ : వీధులలో చెత్త పారవేస్తే భారీ జరిమానా చెల్లించాలని యూఏఈ లోని అల్ ఐన్ నగర మున్సిపాలిటీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొంటున్నారు. రోడ్లు, వీధులలో చెత్త చెదారాలను పడేసేవారికి పరిశుభ్రత పాఠాలు నేర్పించేందుకు పురపాలక అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నివాసప్రాంతాలు, పబ్లిక్ ప్రదేశాల్లో చెత్తను పడేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినవారికి 1000 నుంచి 1,00,000 దిర్హమ్స్ వరకు జరిమానా విధించనున్నామని అధికారులు ప్రకటించారు. మన భారతీయ కరెన్సీలో రూ. 17 వేల నుంచి 17 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు అల్ ఐన్ నగర ప్రణాళిక, మున్సిపాలిటీ అధికారులు ఓ నోటిఫికేషన్ను విడుదల చేశారు.సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఈ సమాచారం తెలియచేస్తున్నారు. అల్ ఐన్లోని ప్రవాసీయులు నిబంధనలు పాటించకాపోతే ఎడారి దేశాలలో సంపాదించింది జరిమానాలు చెల్లించేందుకు సరిపోతుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి