అధిక బరువును తగ్గించే బార్లీ, బఠాణీలు..
- February 15, 2018అధిక బరువును తగ్గించుకోవాలంటే.. పచ్చి బఠాణీలు, బార్లీ గింజలను డైట్లో చేర్చుకోవాలి. బార్లీ గింజల్లో పీచు పుష్కలంగా వుంది. బార్లీ గింజలు పేగుల్లో వుండే మలినాలను తొలగిస్తాయి. కేన్సర్‌ను నియంత్రిస్తాయి. బార్లీ గింజలను తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా వుంటాయి. బార్లీని తీసుకుంటే కీళ్లనొప్పులు దూరమవుతాయి.
బార్లీ గింజలను మెత్తగా ఉడికించాక ఆ నీటిని వడగట్టి అర గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్ నిమ్మరసం కలిపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. ప్రతిరోజూ సూప్, సలాడ్‌తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
బార్లీ గింజలు వృద్ధాప్య ఛాయలు తగ్గించే యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. చర్మానికి ఇవి మెరుపు తీసుకొస్తాయి. అలాగే బఠాణీలు కూడా బరువు తగ్గిస్తాయి. పచ్చిబఠాణీల్లో పీచు మెండుగా వున్నందున జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కంటిచూపును మెరుగుపరచడంలో పచ్చి బఠాణీల్లో ఉండే విటమిన్-ఎ సహాయపడుతుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ