బకెట్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

బకెట్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

20 నెలల బాలిక, వాటర్‌ బకెట్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అల్‌ ధైద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి ఆడుకుంటూ బాత్రూమ్‌లోకి వెళ్ళి అక్కడే, నీరు నిండి వున్న బకెట్‌లోకి దిగడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి తండ్రి బయటకు వెళ్ళగా, ఇంట్లోనే వున్న తల్లి ఫోన్‌లో మాట్లాడుతూ వుంది. మరో చిన్నారి టీవీ చూస్తూ ఉన్నట్లు తల్లి చెప్పింది. ఫోన్‌లో మాట్లాడటం పూర్తయ్యాక, చిన్నారి కోసం వెతికిన తల్లికి బకెట్‌లో అచేతనావస్థలో పడిన చిన్నారి కన్పించింది. వెంటనే ఆ చిన్నారిని దగ్గరలో వున్న ఆసుపత్రికి తరలించారు. బకెట్‌లోకి దిగగానే చిన్నారి నీటిని ఎక్కువగా తాగేసిందనీ, ఆ కారణంగానే ఆ చిన్నారి మృతి చెందడం జరిగిందనీ వైద్యులు తెలిపారు. 

Back to Top