దుబాయ్ మెరీనాలో స్వల్ప అగ్నిప్రమాదం వేగంగా నియంత్రణ

- February 16, 2018 , by Maagulf
దుబాయ్ మెరీనాలో స్వల్ప అగ్నిప్రమాదం వేగంగా నియంత్రణ

దుబాయ్ : దుబాయ్ మెరీనాలో శుక్రవారం ఉదయం భారీ నల్లని పొగలు దట్టంగా అలుముకున్నాయి. ప్లాంట్ పోర్ట్ లో దురదృష్టవశాత్తూ ఎవరో తాగిపారేసిన సిగరెట్ పీక కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని దుబాయ్ పౌర రక్షణ అధికారి ఒకరు ట్వీట్ చేశారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్లో ఫైర్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ జనరల్ బ్రిడ్జ్ రషీద్ ఖలీఫా బుఫ్లాసా ఈ సందర్భంగా మాట్లాడుతూ, అల్ హబ్బోర్ హోటల్ సమీపంలోని ఒక మొక్కల కుండలో విసిరిన సిగరెట్ పీక గాలికి నిప్పు రాజుకొని అగ్నిప్రమాదం ప్రారంభమైందని తెలిపారు. ఇది ఒక చిన్న అగ్నిప్రమాదమని ఈ ప్రమాజంలో ఏ ఒక్కరు గాయపడలేదని  పేర్కొంటూ అగ్నిమాపక సిబ్బంది మంటలను వేగంగా నియంత్రించారని బ్రిగ్రేడెర్ భూఫలస  అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com