చివరి మ్యాచ్‌లోనూ ఇండియాదే పైచేయి
- February 16, 2018
5-1 వన్డే వన్డే సిరీస్ భారత్ పూర్తి
దక్షిణాఫ్రికా పర్యటనలో మొదటి టూర్‌ను భారత క్రికెట్ జట్టు విజయవంతంగా పూర్తి చేసింది. 6 వన్డేల మ్యాచ్‌ల సిరీస్‌ను 5-1తో పూర్తి చేసింది. చివరి మ్యాచ్‌లో సునాయాసంగా విజయం దక్కించుకుంది. గతంలో ఎప్పుడూ లేనట్టు భారత్ ప్రదర్శన చేసింది. శుక్రవారం సెంచూరియన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా 200 కూడా చేయలేక కష్టపడింది. చివరికీ అతికష్టంగా 205 పరుగుల చేసి భారత్‌కు లక్ష్యం విధించింది. మ్యాచ్ లక్ష్యం చేధించడంలో భారత్‌కు అలవాటే. ఎంతటి లక్ష్యాన్నైనా ఈజీగా పూర్తి చేసే నేర్పు భారత్‌కు ఉండడంతో ఈ మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శన చేశారు. చివరకు దక్షిణాఫ్రికాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 32.1 ఓవర్లలోనే, 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది.
కెప్టెన్ విరాట్ కోహ్లి (129 నాటౌట్, 96 బంతుల్లో 19×4, 2×6) సిరీస్‌లో మూడో సెంచరీ బాదేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.
అంతకుముందు కెరీర్లో మూడో వన్డే మాత్రమే ఆడుతూ శార్దూల్ ఠాకూర్ (4/52) చెలరేగిపోగా.. బుమ్రా (2/24), చాహల్ (2/38) కూడా చక్కటి ప్రదర్శన చేయడంతో దక్షిణాఫ్రికా 46.5 ఓవర్లలో 204 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో జొండో (54; 74 బంతుల్లో 3×4, 2×6) టాప్‌స్కోరర్. కోహ్లి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'తో పాటు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి