ఆసిఫ్ ఖాన్ అనే 22 ఏళ్ల యువకుడికి పునర్జన్మ... గంట సేపు ఆగి కొట్టుకున్న గుండె

- February 16, 2018 , by Maagulf
ఆసిఫ్ ఖాన్ అనే 22 ఏళ్ల యువకుడికి పునర్జన్మ... గంట సేపు ఆగి కొట్టుకున్న గుండె

మనిషి గుండె పోటు.. నలభై ఏళ్ల తర్వాత వస్తే.. దానిని తట్టుకొని కొన్ని ఏళ్ళు మళ్ళీ జీవిస్తాడు.. అదే చిన్న వయసులో గుండె పోటు వస్తే.. బతికే అవకాశాలు చాలా తక్కువ.. అదీ తీవ్రమైన నొప్పి వస్తే.. ఇక ఆ వ్యక్తి మీద ఆశలు వదులుకోవడమే..! కానీ గుండె కొట్టుకోవడం అయిగిపోయిన తర్వాత ఓ యువకుడు బతికి మృత్యుంజయుడయ్యాడు. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో 12 రోజుల క్రితం చోటు చేసుకొన్నది. 
అలీ గఢ్ కు చెందిన ఆసిఫ్ ఖాన్ అనే 22 ఏళ్ల ఇంజనీర్ కు తీవ్ర గుండె నొప్పిరావడంతో ఆస్పత్రి లో చేరాడు. వైద్య సహాయం అందిస్తున్న సమయంలోనే తీవ్ర గుండెపోటుకు గురైన ఆసిఫ్ ఖాన్  గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. కానీ వైద్యులు తమ ప్రయత్నం మానలేదు.. కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) ద్వారా రక్తం సరఫరా అయ్యేలా చేశారు. డీఫైబ్రిలేటర్ ను ఊయపయోగించి గుండెకు షాక్ ఇచ్చి తిరిగి స్పందించే విధంగా ప్రయత్నాలు చేశారు.. అలా నిర్విరామంగా ఒక గంట సేపు వైద్యం ఆ యువకుడికి అందించగా... ఒక్కసారిగా వైద్యం కు స్పందించిన గుండె తిరిగి కొట్టికోవడం ప్రారంభించింది. పరీక్షల్లో రక్తనాళంలో రక్తం గడ్డకట్టినట్లు తెలియడంతో.. ఆపరేషన్ చేసి దానిని తొలగించారు.. స్టెంట్ అమర్చారు.. ఇప్పుడు ఆసిఫ్ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడింది.. దీంతో శుక్రవారం రోజున ఆస్పత్రి నుంచి ఆరోగ్య వంతుడిగా డిశ్చార్జీ అయ్యాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com