జపాన్ 5జీ డేటా ట్రాన్స్‌మిషన్ ప్రయోగాలు...
- November 26, 2015
మన దేశంలో 4జీ మొబైల్ నెట్‌వర్క్ ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. కొంతమంది ఆపరేటర్లు దీన్ని ప్రవేశపెట్టి, బాగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ జపాన్ మాత్రం అప్పుడే ఒకడుగు ముందుకు వేసేసింది. అక్కడ వైర్‌లెస్ కమ్యూనికేషన్లలో ముందంజలో ఉన్న ఓ కంపెనీ.. విజయవంతంగా 5జీ డేటా ట్రాన్స్‌మిషన్ ప్రయోగాలు చేసింది. 2020 నాటికి దీన్ని వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెబుతోంది. ఎన్ఐటీ డొకోమో ఇంక్ సంస్థ ఈ ప్రయోగం చేసింది. టోక్యోలోని రొపోంగి హిల్స్ కాంప్లెక్సులో తాము అక్టోబర్ 13వ తేదీన అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్‌మిషన్ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్ వేగాన్ని అందుకుందని కంపెనీని ఉటంకిస్తూ సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఈ ప్రయోగంలో.. మిల్లీమీటరు తరంగదైర్ఘ్యంతో కూడిన సిగ్నళ్లను అత్యధికంగా 70 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యంతో పంపారు. ఇప్పటివరకు షాపింగ్ మాల్స్ లాంటి వాణిజ్య ప్రాంగణంలో ఎవరూ 5జీ డేటా ట్రాన్స్‌మిషన్ ప్రయోగాలు చేయలేదని, సాధారణంగా ఇలాంటి చోట్ల డేటా ట్రాన్స్‌మిషన్‌లో రకరకాల సమస్యలు రావడమే ఇందుకు కారణమని డొకోమో సంస్థ తెలిపింది. అయితే, తాము బీమ్ ఫార్మింగ్, బీమ్ ట్రాకింగ్ అనే రెండు కొత్త టెక్నాలజీలు ఉపయోగించి మొబైల్ పరికరం ఎక్కడుందో అన్న దాని ఆధారంగా బీమ్ దిశను నియంత్రించామని డొకోమో వివరించింది. దానివల్ల తమ ప్రయోగం విజయవంతం అయినట్లు చెప్పింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







