ఇరాన్‌లో ఘోర ప్రమాదం కుప్పకూలిన విమానం.. 66 మంది మృతి!

- February 18, 2018 , by Maagulf
ఇరాన్‌లో ఘోర ప్రమాదం కుప్పకూలిన విమానం.. 66 మంది మృతి!

టెహరాన్‌ః ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టెహరాన్ నుంచి యాసుజ్ వెళ్తున్న ఓ విమానం మధ్య ఇరాన్‌లో కూలిపోయింది. సెమిరామ్ టౌన్ దగ్గర్లోని కొండ ప్రాంతంలో విమానం కూలినట్లు ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి మోజ్‌తబా ఖలేదీ వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 66 మంది ఉన్నారు. టెహరాన్‌లో టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆ విమానం రాడార్ నుంచి తప్పిపోయింది. ఎమ‌ర్జెన్సీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం జ‌రిగిన స్థ‌లానికి వెళ్లేందుకు ప్ర‌యత్నిస్తున్నా.. వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌పోవ‌డంతో వెళ్లలేక‌పోయింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com