ఐదు రోజులపాటు అబుదాబీ రోడ్స్‌ పాక్షికంగా మూసివేత

- February 20, 2018 , by Maagulf
ఐదు రోజులపాటు అబుదాబీ రోడ్స్‌ పాక్షికంగా మూసివేత

అబుదాబీ:నాలుగవ ఎడిషన్‌ అబుదాబీ టూర్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు స్టేజీలలో సాగే సైకిలింగ్‌ రేస్‌లో యూఏఈ క్యాపిటల్‌కి బెస్ట్‌ సైక్లిస్ట్‌లను తీసుకురానుంది. ఈ నేపథ్యంలోని పలు రోడ్స్‌ పాక్షికంగా మూసివేయబడతాయి. బుధవారం ట్రావెలర్స్‌, అలాగే ముదినాత్‌ జాయెద్‌ రెసిడెంట్స్‌, షామ్స్‌ సోలార్‌ పవర్‌ స్టేషన్‌ ఇ45 (11.30 గంటల సమయంలో మూసివేస్తారు. మళ్ళీ 3.45 నిమిషాల సమయంలో మూసివేస్తారు), లివా రీజియన్‌ ఇ90 (మధ్యాహ్నం 1 - 2 గంటలు) మూసివేయడం జరుగుతుంది. ప్రారంభం మరియు ముగింపు సమయంలో రహదారిపై కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. అంటే 11.30 నిమిషాల నుంచి 12.30 నిమిషాల మధ్య అలాగే 3.45 నుంచి 5.00 గంటల వరకు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయి. గురువారం స్టేజ్‌ 2 యాస్‌ ఐలాండ్‌లో ఉంటుంది. రీమ్‌ ఐలాండ్‌, అల్‌ రభా (12.05 నుంచి 12.45 వరకు), అల్‌ సమ్హా, ఖలీఫా పోర్ట్‌, అల్‌ తవీలా, అల్‌ బహియా (2 గంటలు), తిరుగు ప్రయాణంలో కొంత మేర ట్రాఫిక్‌ సమస్యలుంటాయి. ఫ్రైడే రేస్‌ కవరింగ్‌ సిటీ. నేషన్‌ టవర్స్‌ స్టేజ్‌ కోసం కార్నిచ్‌ నుంచి అల్‌ బతీన్‌ స్ట్రీట్‌, అల్‌ ఖలీజ్‌ అల్‌ అరాబి, అడ్నెక్‌ ఓంటో ముసాఫా బ్రిడ్జి, ఎగ్జిట్‌ టు అల్‌ వాత్బా, మనియాస్‌ సిటీ, యాస్‌ ఐలాండ్‌, సాదియాత్‌ ఐలాండ్‌, లావ్ర్‌ దుబాయ్‌ ఇంటర్‌చేంజ్‌ మరియు ఎంటర్‌ కార్నిచ్‌ వరకు 12.45 నిమిషాల నుంచి 3.50 నిమిషాల వరకు అక్కడక్కడా రోడ్‌ బ్లాక్స్‌ ఉంటాయి. శనివారం 4వ స్టేజ్‌ రేస్‌ అల్‌ మరయా ఐలాండ్‌లో ఉంటుంది. 12.6 కిలోమీటర్ల రేస్‌ జాయెద్‌ ఫస్ట్‌ స్ట్రీట్‌, గేట్‌ టవర్స్‌ వరకు 12 గంటల నుంచి 4 గంటల మధ్య జరుగుతుంది. గ్రాండ్‌ ఫినాలే అల్‌ అయిన్‌ జబెల్‌ హఫీట్‌ స్టేజ్‌. ఈ రేస్‌ ఉదయం 11.45 నిమిషాలకు అల్‌ అయిన్‌ నుంచి స్వీహాన్‌, యూఏఈ యూనివర్సిటీ, అబుదాబీ అల్‌ అయిన్‌ ట్రక్‌ రోడ్‌ నుంచి జబెల్‌ హఫీత్‌ పీక్‌ వరకు (4 గంటలు) సాగుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com