కువైట్ బయల్దేరిన ఏ.పి ఎన్.ఆర్.ఐ మంత్రి కొల్లు రవీంద్ర
- February 20, 2018కువైట్ ప్రభుత్వ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) తో సుమారుగా 5,000 మంది ప్రవాసాంధ్రులు స్వరాష్ట్రానికి వస్తున్నారని అంచనా. అధిక శాతం కడప, గోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన చిరు ఉద్యోగులు ఉండటం గమనార్హం.జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్ళి, అక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ, అక్కడి చట్టాలు తెలియక, ఫైన్ లు కట్టలేక కువైట్ లో అనధికారికంగా బ్రతుకుతున్న ప్రవాసులు ఎటువంటి ఫైన్ లు చెల్లించనవసరం లేకుండా స్వదేశానికి వెళ్ళవచ్చునంటూ కువైట్ ప్రభుత్వం చేసిన ఆమ్నెస్టీ ప్రకటన ను విని వేలాదిగా ప్రవాసులు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.
దీనికి సంబంధించిన .కువైట్ దేశ పర్యటన నిమిత్తం మచిలీపట్నం నుండి ఈ రొజు రాత్రి అనగా 20-2-2018 బయలు దేరిన న్యాయ, NRI శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయన వెంట APNRT డైరెక్టర్ రాజశేఖర్ చప్పిడి కూడా ఉన్నారు.ఆమ్నెస్టీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!