విమాన టికెట్ల కోసం ఎంపీ కవిత ఆపన్నహస్తం

- February 20, 2018 , by Maagulf
విమాన టికెట్ల కోసం ఎంపీ కవిత ఆపన్నహస్తం

కువైట్ ఆమ్నెస్టీ(క్షమాభిక్షా) బాధితులకు తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో చేయూతనిచ్చేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముందుకొచ్చారు. బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లి, అక్కడి నిబంధనలు ఉల్లంఘించి జైలు పాలైన వారికి ఆ దేశం ఆమ్నెస్టీ(క్షమాభిక్షా) ప్రకటిస్తూ, ఈ నెల 22వ తేదీని తుది గడువును ఇచ్చింది. క్షమాభిక్షా పొందిన వారు ఇండియాకు వచ్చేందుకు విమాన టికెట్ చూపించాల్సి ఉంటుంది. అయితే టికెట్‌కు డబ్బులు లేని చాలామంది అక్కడే ఉంటు న్నారు. అలాంటి వారెవరైనా ఉంటే ఈనెల 22లోపు వివరాలు [email protected]కు గానీ, సెల్ :9959675558కు గానీ తెలియజేయాలని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి తెలిపారు. వారికి ఎంపీ కవిత సహాయం చేస్తారని చెప్పారు.ఆమ్నెస్టీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com