ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 22 వరకు కొత్త క్షమాబిక్ష కాలం పొడగించిన కువైట్
- February 20, 2018
కువైట్: వీసా గడువు ముగిసినా కువైట్ దేశం నుంచి కదలని విదేశీయులకు ఎటువంటి ఆక్షేపణలు లేకుండా వారి వారి దేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) కాలాన్ని కువైత్ ప్రభుత్వం రెండు నెలలు పాటు పొడిగించింది. మాములుగా ఈ నెల 22 వ తేదీ (గురువారం) గడువు ముగియనుంది. కానీ.. ఆ దేశ ఉపప్రధాని షేక్ ఖాలీద్ జర్రా అల్ సబ మంగళవారం చేసిన ఒక ప్రకటనతో వీసాలను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ఏప్రిల్ 22 వరకు అవకాశం కల్పించారు. కువైట్ దేశంలో క్షమాభిక్ష పథకానికి ఇప్పటి వరకు సుమారు 10,000 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 4,000 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారని సమాచారం .అక్రమ నివాసితులు కువైట్ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న కారణంగా, మంత్రిత్వశాఖ ఈ తేదీకి పొడిగింపును ప్రకటించింది మరియు ఫిబ్రవరి 23 వ తేదీ నుండి ఏప్రిల్ 22 వరకు కొత్త అమ్నెస్టీ చెల్లుబాటు అవుతుంది. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీని ఉపయోగించుకోవడానికి ఈ దేశంలో చెల్లుబాటు అయ్యే పత్రం లేకుండా భారత ప్రవాసీయులందరిని భారత రాయబార కార్యాలయం జ్ఞాపకం చేసింది. ఈ క్షమాబిక్ష కాలంలో దేశం విడిచిపెట్టినట్లయితే, వారు సాధారణ నియమ నిబంధనలను అనుగుణంగా వ్యవహరిస్తే మళ్లీ కువైట్ లోకి ప్రవేశించటానికి అనుమతించబడతారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినవారికి ఈ మినహాయింపు లభిస్తుందని అంచనా.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







