షాకింగ్: టాలీవుడ్ హీరో శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడి
- February 21, 2018
ప్రత్యేక హోదా అంశం రోజు రోజుకీ రాజుకుంటోంది. టాలీవుడ్ హీరో శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. హోదా కోసం ఓ తెలుగు చానెల్ నిర్వహిస్తున్న చర్చలో బుధవారం ఉదయం పాల్గొన్నారు. శివాజీ మాట్లాడుతుండగా చర్చలోకి చొరబడ్డ బీజేపీ కార్యకర్తలు.. 'శివాజీ.. డౌన్.. డౌన్' అంటూ నినాదాలు చేశారు. ఈ తరుణంలో మాటామాటాపెరిగి సంయమనం కోల్పోయిన కార్యకర్తలు శివాజీపై దాడికి దిగారు. హోదా కోసం ప్రశ్నించడాన్ని భరించలేని బీజేపీ కార్యకర్తలు తనపై దాడికి దిగారని శివాజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను ప్రజా సంఘాలు, ప్రజలు అడ్డుకోవడంతో గొడవ సర్దుమనిగింది. ఇదిలా ఉంటే మరోవైపు.. బీజేపీ నేతలు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు.
విభజన హామీల కోసం న్యాయస్థానానికి వెళ్తాం అనడం రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనమే అని సినీ నటుడు శివాజీ ఘాటుగా విమర్శించారు. మీరు బాగా పని చేసే సత్తా ఉన్న నాయకులు, కానీ ఎందుకు చేయలేకపోతున్నారంటూ ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీని గట్టిగా ఎందుకు నిలదీయలేకపోతున్నారనే అర్థం ధ్వనించేలా శివాజీ మాట్లాడారు. కేంద్రాన్ని చూసి ఏపీ భయపడుతోందన్నారు. విభజన హామీల సాధన సమితి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. తెలుగు ప్రజల్ని బీజేపీ మోసం చేస్తోందన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఈ ఒక్క ఏడాదైనా నిజాయతీగా పని చేయాలని శివాజీ ఎంపీలను కోరారు. ప్రత్యేక హోదాపై పోరాడేందుకు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకెళ్లాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. మనకు అన్యాయం జరుగుతుంటే పోరాడే నేతలే లేరా అని శివాజీ ప్రశ్నించారు. గుంటూరు జిల్లాకు పరిశ్రమలను కేటాయించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కమలనాథుల్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖకు రైల్వే జోన్ తదితర హామీలను నెరవెరిస్తే.. 2019లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని శివాజీ ఘంటాపథంగా చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఎంత మేర నిధులు ఇచ్చిందో పురందేశ్వరి లెక్కలు చెప్పాలని శివాజీ డిమాండ్ చేశారు. మాతో ఏపీ పోటీ పడలేదని పొరుగు రాష్ట్రాలు అంటుంటే బాధేస్తోందని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?







