హైదరాబాద్‌లో హైటెక్ బస్టాప్‌లు

- February 22, 2018 , by Maagulf
హైదరాబాద్‌లో హైటెక్ బస్టాప్‌లు

మొదటి దశలో సెంట్రల్‌జోన్‌కే ప్రాధాన్యం...
జీహెచ్‌ఎంసీకి పైసా ఖర్చులేకుండా ఆధునీకరణ..
ఖైరతాబాద్‌: ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో మామూలు బస్టా్‌పలకు తావుండదు... అన్ని హైఫై బస్టా్‌పలే కనిపించనున్నాయి. జీహెచ్‌ఎంసీకి పైసా ఖర్చు లేకుండా డిజైన్‌ బిల్డ్‌ ఫైనాన్స్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎ్‌ఫవోటీ) విధానంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో బస్టా్‌పల ఆధునీకరణ జరగనుంది. తొలి విడతగా జీహెచ్‌ఎంసీలో 12 బస్టా్‌పలను మాత్రమే ఆధునీకరిస్తుండగా, అందులో 9 సెంట్రల్‌జోన్‌ పరిధిలోనే ఉండడం గమనార్హం. బస్‌ షెల్టర్‌లను గ్రేడ్‌ - 1,2,3,4లుగా విభజించి ప్రాంతాల వారీగా వాటిని అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 6 నెలల వ్యవధిలో ఈ బస్టా్‌పలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. గ్రేడ్‌-1 బస్టా్‌పలు 200 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌, వైఫై సౌకర్యం, కాఫీ షాప్‌, ఏసీ సౌకర్యం, సీసీ టీవీలు, భవిష్యత్తులో టికెట్‌ వెండింగ్‌ మిషన్‌లు, చెత్త డబ్బా, మరుగుదొడ్ల లాంటి సౌకర్యాలు ఉంటాయి. గ్రేడ్‌-2 బస్టా్‌పలు 25 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, వైఫై సౌకర్యం, మరుగుదొడ్లు, చెత్త డబ్బా, మొబైల్‌ ఛార్జింగ్‌, తాగునీరు, సీసీటీవీ, ఫ్యాన్‌లతో పాటు భవిష్యత్తులో టికెట్‌ వెండింగ్‌ మిషన్‌లు ఉంటాయి. గ్రేడ్‌-3 బస్టా్‌పలు 20 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో మొబైల్‌ ఛార్జింగ్‌, చెత్త డబ్బా, మరుగుదొడ్లు, తాగునీరు, సీసీటీవీ సౌకర్యాలు ఉండనున్నాయి. ఇవన్నీ నిర్మాణమైతే జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్టా్‌పలు విదేశాలను పోలే విధంగా చూడముచ్చటగా కనిపించనున్నాయి.

తొలివిడతలో సెంట్రల్‌జోన్‌లో 9...

మొత్తం జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 826 బస్టా్‌పలను ఆధునీకరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీస్‌, ఆర్టీసీ, రెవెన్యూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొత్తగా నిర్మించాల్సిన బస్టా్‌పలను అభివృద్ధి చేయాల్సిన వాటిని గుర్తించి ఫైనల్‌ చేశారు. తొలి విడతలో జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 12 బస్టా్‌పలను మాత్రమే ఆధునీకరించాలని నిర్ణయించగా, అందులో సెంట్రల్‌జోన్‌లోనే 9 బస్టా్‌పలు ఉన్నాయి. వీటిలో సచివాలయ బస్టాప్‌ (గ్రేడ్‌-1), లిబర్టీ, ట్యాంక్‌బండ్‌ బస్టాప్‌ (గ్రేడ్‌ 2), బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 2 (గ్రేడ్‌-2), ఖైరతాబాద్‌ ఆర్టీఏ బస్టాప్‌ (గ్రేడ్‌-1), షేక్‌పేట సెవెన్‌టూంబ్స్‌ (గ్రేడ్‌-2), ఆబిడ్స్‌ గ్రామర్‌ స్కూల్‌ (గ్రేడ్‌ 2), ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌ సుదర్శన్‌ థియేటర్‌ (గ్రేడ్‌-3), జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ (గ్రేడ్‌-2), రాయదుర్గం (గ్రేడ్‌-2) ఉన్నాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పనులను ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేయగా మరో 3 నుంచి 4 నెలల వ్యవధిలో ఈ తొలి విడత బస్టా్‌పలు సిద్దమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీబీఎ్‌ఫవోటీ విధానంలో బస్టా్‌పలను ఆధునీకరించి అందులో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో 15యేళ్ల పాటు నిర్మాణ సంస్థ బస్టా్‌పలను నిర్వహించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.

ద్వితీయ శ్రేణి రహదారుల బస్టా్‌పలను కూడా... కేవలం నగరంలోని ప్రధాన బస్టా్‌పలనే కాకుండా ద్వితీయ శ్రేణి రహదారులపై ఉన్న బస్టా్‌పలను కూడా ఆధునీకరించనున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలుపుతున్నారు. గతంలో కేవలం ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్న బస్టా్‌పలను మాత్రమే ఆధునీకరించి ప్రైవేటు సంస్థలు ఆదాయ వనరుగా మార్చుకునేవి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ చేపడుతున్న చర్యలతో అంతర్గత రహదారుల్లో ఉన్న బస్టా్‌పలను కూడా ఆధునీకరించనున్నారు. గ్రేడ్‌-4 బస్టా్‌పలలో సీసీ టీవీలు, చెత్త డబ్బాల ఏర్పాటుతో పాటు గ్రేడ్‌-3 బస్టా్‌పలలో పురుషులకు, మహి ళలకు విడివిడిగా టాయ్‌లెట్లు, మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం చాలా బస్టా్‌పలలో షెల్టర్లు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చాలా బస్టా్‌పలలో ఆటోలు తిష్ట వేసుకుని ఉండడంతో పాటు ప్రయాణికులు కూర్చునేందుకు కూడా సరైన సదుపాయాలు లేక బాధపడుతున్నారు. మరికొన్ని బస్టా్‌పలు మెట్రో రైలు పనుల నేపథ్యంలో కుంచించుకుపోయాయి. జీహెచ్‌ఎంసీపై ఎలాంటి భారం లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బస్టా్‌పలను ఆధునీకరించి 15 సంవత్సరాల పాటు ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతూ నిర్వహణ బాధ్యతను స్వీకరించేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంతో త్వరలోనే మన బస్టా్‌పలు చూడముచ్చటగా అన్ని సౌకర్యాలతో ఆకట్టుకోనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com