సిరియా సేనల దాడుల్లో 400 మందికి పైగా మృతి
- February 23, 2018
- సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్‌రైట్స్ వెల్లడి
డౌమా (సిరియా): సిరియాలోని డౌమా పట్టణంపై ప్రభుత్వ సేనలు, మిత్రదేశం రష్యా సేనలు గత ఐదు రోజులుగా జరిపిన భూతల, వైమానిక దాడుల్లో 95 మంది చిన్నారులతో సహా మొత్తం 403 మంది పౌరులు మరణించారని లండన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. తూర్పు ఘౌట ప్రాంతంపై జరిగిన తాజా బాంబింగ్‌లో అనేక మంది మరణించటంతో సిరియా సేనలు గత ఐదు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మరణించిన వారి సంఖ్య 400 దాటినట్లు ఈ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఒక్కరోజు వైమానిక, భూతల దాడుల్లో దాదాపు 46 మందికి పైగా మరణించారని, ఇప్పటికైనా ఏడున్నరేళ్ల ఈ రక్తపాతానికి తెరదించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు అది విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి