'గ్రే లిస్ట్‌'లోకి పాకిస్తాన్‌: ఎఫ్‌ఎటిఎఫ్‌ నిర్ణయం

- February 23, 2018 , by Maagulf
'గ్రే లిస్ట్‌'లోకి పాకిస్తాన్‌: ఎఫ్‌ఎటిఎఫ్‌ నిర్ణయం

 న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక అండదండలందిస్తున్న ఆరోపణలెదుర్కొంటున్న పాకిస్తాన్‌పై నిఘా పెంచుతూ ఆ దేశాన్ని 'గ్రే లిస్ట్‌'లో చేర్చాలని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఎటిఎఫ్‌) నిర్ణయించింది. 1989లో ఏర్పడిన ఈ అంతర్‌ ప్రభుత్వ వ్యవస్థలో వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా వుంటారు. ఉగ్ర ఆర్థిక సాయం, మనీలాండరింగ్‌ వంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే నేరాలపై పోరులో అవసరమైన ప్రమాణాలను ఏర్పాటు చేయటం, వాటిని అమలు చేసేందుకు అవసరమైన చట్టపరమైన, నియంత్రణా, నిర్వహణా చర్యలు తీసుకోవటం ఈ వ్యవస్థ ఏర్పాటు ముఖ్యోద్దేశం. పాకిస్తాన్‌ను గ్రేలిస్ట్‌లో పెట్టాలన్న ప్రతిపాదనపై తొలుత వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని చైనా ఉపసంహరించుకోవటంతో ఈ అంశంపై ఏకగ్రీవ నిర్ణయానికి మార్గం సుగమమైంది. ఉగ్ర ఆర్థిక సాయం విషయంలో పాకిస్తాన్‌ను గ్రేలిస్ట్‌లో పెట్టే అంశంపై జరిగిన ప్రాథమిక చర్చలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com