'పిజ్జా' దర్శకుడితో రజని
- February 24, 2018
రజనీకాంత్ కోరుకుంటే... అగ్ర దర్శకులంతా ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. సినిమాలు తీయడానికి పోటీ పడతారు. కానీ రజనీ ఆలోచనలు మారాయి. ఆయన యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. 'కబాలి', 'కాలా' రెండూ పా.రంజిత్‌తో పనిచేసిన చిత్రాలే. ఇప్పుడు మరో కుర్ర దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. తనే... కార్తీక్ సుబ్బరాజు. తమిళనాట 'పిజ్జా'ని రూపొందించి అందరి దృష్టినీ ఆకర్షించారాయన. రెండో చిత్రం 'జిగడ్తాండ' కూడా విమర్శకుల్ని మెప్పించింది. తను రజనీ కోసం ఓ కథ సిద్ధం చేశాడు. అది తలైవాకి నచ్చింది. 'కాలా' తరవాత సెట్స్‌పైకి వెళ్లే చిత్రం ఇదే కావొచ్చు. రజనీ 'కాలా' ఏప్రిల్ 27న విడుదల కానుంది. ఆ తరవాత '2.ఓ' వస్తుంది. ఈలోగా కార్తిక్ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







