శ్రీదేవిని సర్ ప్రైజ్ చేద్దామనుకున్నాం కానీ.. : బోనీకపూర్
- February 26, 2018
శ్రీదేవి ఆకస్మిక మరణంతో సినీలోకం తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఆదివారం ఉదయమే అభిమానులను, సినీ ప్రముఖులను ఈ వార్త కుదిపేసింది. తన మోహిత్ మార్వా పెళ్లి కోసం దుబాయ్‌కి వెళ్లిన శ్రీదేవి అక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణానికి ముందు ఏం జరిగిందనే ఓ వార్తను దుబాయ్‌లోని ఖలీజ్ టైమ్స్ ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది.
అదేమిటంటే..శ్రీదేవికి షాకిద్దామని మోహిత్ మర్వా పెళ్లి తర్వాత బోనికపూర్ తన కూతురు ఖుషీకపూర్‌తో కలిసి దుబాయ్ నుంచి ముంబైకి వచ్చారు. ఆ తర్వాత చిన్నకూతురును ముంబైలో వదిలేసిన బోని శ్రీదేవికి సర్ప్రైజ్ ఇచ్చేందుకు ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్లాడు. జాహ్నవి షూటింగ్లో బిజీ వల్ల ఆమె ఈ పెళ్లి హాజరుకాని సంగతి తెలిసిందే.శ్రీదేవి బస చేసిన దుబాయ్‌లోని జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో శనివారం సాయంత్రం 5.30 గంటలకు బోని చేరుకొని ఆమెకు షాకిచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడుకొన్న తర్వాత వారిద్దరూ డిన్నర్ డేట్‌కు ప్లాన్ చేసుకొన్నారు. దాంతో డిన్నర్ పది నిమిషాల్లో తయారై వస్తానని చెప్పి శ్రీదేవి బాత్రూంలోకి వెళ్లిందట.బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి 15 నిమిషాలైనా రాకపోవడంతో బోని డోర్ తట్టాడట. అయితే లోపల నుండి ఏలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే బలవంతంగా డోర్‌ను ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే బాత్‌టబ్‌లోని నీటిలో శ్రీదేవి అచేతనంగా పడి ఉండటంతో బోని షాక్ గురయ్యాడు. వెంటనే స్నేహితుడికి సమాచారం అందించి ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.అచేతనంగా పడి ఉన్న శ్రీదేవిని బతికించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాం. కానీ మా ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ తర్వాత 9 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందించాం అని బోని సన్నిహితులు పేర్కొన్నారు.
శ్రీదేవి మరణాన్ని ధృవీకరించిన తర్వాత ఆమె పార్దీవ దేహాన్ని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె దేహానికి శవపరీక్ష చేస్తున్నారు. ఆదివారం రాత్రి శ్రీదేవి రక్త నమూనాలను టెస్టుల కోసం పంపాం అని అధికారులు వెల్లడించారు.భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11.30 గంటలకు శ్రీదేవి బ్లడ్ రిపోర్టులు వస్తాయి. ఆ తర్వాతే డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అనంతరం శ్రీదేవి దేహాన్ని తరలించేందుకు చర్యలు ప్రారంభిస్తారు.శ్రీదేవి దేహాన్ని అంబానీ పంపిన ప్రైవేట్ జెట్ విమానంలో ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం రాత్రికి శ్రీదేవి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. శ్రీదేవి అంత్యక్రియల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







